వారిని బాధపెట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు- తలసాని

149
ministe talasani
- Advertisement -

‌ఇటీవ‌ల‌ ఓ కార్య‌క్ర‌మంలో గంగపుత్రుల పట్ల రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని అఖిల భారత గంగపుత్ర సంఘం ఆరోపించింది. ఈ నేప‌థ్యంలో మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్‌ యాదవ్ తాజాగా ఓ వీడియో విడుద‌ల చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తలసాని తెలిపారు. కోకాపేటలో జరిగిన ముదిరాజ్ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో గంగపుత్రులను బాధపెట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని మంత్రి స్పష్టం చేశారు.

గంగపుత్రుల మనోభావాలు కించపరిచేలా తాను తప్పుగా ఏమీ మాట్లాడలేదని, ఒక‌వేళ‌ వారి మనోభావాలు దెబ్బ తినేలా మాట్లాడానని అనిపిస్తే క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమ‌ని చెప్పారు. కేసీఆర్ గంగపుత్రులకు చెరువులు, కుంటలు మీద సర్వాధికారాలు ఇవ్వాలని అసెంబ్లీలో చెప్పిన విష‌యాన్నే తాను ప్రస్తావించానని మంత్రి తెలిపారు. తాను వారి‌ని ఉత్సాహ‌ప‌ర్చ‌డానికే కొన్ని మాట‌లు మాట్లాడాన‌ని అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు గంగ‌పుత్రుల‌ను ప‌ట్టించుకునేవారే లేర‌ని చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి వ‌చ్చాక వారి సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారు.

- Advertisement -