తెలంగాణ‌లో మ‌రో భారీ పెట్టుబ‌డి

399
ktr
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పెట్టుబడులు వెల్లువలా వస్తున్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టగా తాజాగా మరో సంస్థ ముందుకొచ్చింది.

అట్టారో ఇండియా కంపెనీ రాష్ట్రంలో రూ. 600 కోట్ల భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేష్ రంజన్‌, మంత్రి కేటీఆర్ సమక్షంలో కంపెనీ ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ పెట్టుబడి ద్వారా 300 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. అలాగే పరోక్షంగా చాలామందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించారు మంత్రి కేటీఆర్.

అట్టారో కంపెనీ రీసైక్లింగ్, అప్‌సైక్లింగ్, లి-అయాన్ రీసైక్లింగ్, రివర్స్ లాజిస్టిక్స్, కన్సల్టింగ్ మరియు కార్బన్ ఫుట్‌ప్రింట్ ఇండస్ట్రీలో గుర్తింపు పొందింది. విలువైన, ఫెర్రస్ మరియు ఎర్త్ లోహాలను వెలికితీయడంలో అనుభవం ఉన్న కంపెనీ. నోయిడాలో సంస్థ ప్రధాన కార్యాలయం ఉంది.

ఇవి కూడా చదవండి..

బండికి అధిష్టానం అక్షింతలు..

మొక్కలు నాటిన BB6 కంటెస్టెంట్‌ అర్జున్‌

తెలంగాణ పోలీసులకు..స్పెషల్‌ ఆపరేషన్‌ మెడల్స్‌

- Advertisement -