- Advertisement -
కాంగ్రెస్ సీనియర్ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు ఇంటిపై గుర్తు తెలియని దుండగులు దాడిచేశారు. బుధవారం రాత్రి అంబర్‌పేటలోని వీహెచ్ ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లతో దాడిచేశారు.
ఇంటి ముందు నిలిపిన కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు వీహెచ్. దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బడుగు బలహీన వర్గాల సమస్యలు ఉన్నాయంటే వాటి పరిష్కారానికి తాను ముందుంటానని…దానిని జీర్ణించుకోలేని వారు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు.
- Advertisement -