కాంగ్రెస్ నేత శశి థరూర్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. అయితే దుండగులు ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బైక్‌లపై వచ్చిన కొందరు వ్యక్తులు వాహనాన్ని ఆపి, గన్‌మన్‌ను మాటలతో దూషించి, తరువాత అతనిపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై గన్‌మన్ స్వయంగా ఫిర్యాదు చేశారు.
శశి కాన్వాయ్‌ను కొందరు వ్యక్తులు వెంబడించి ఆయన కారుపై దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వాండూర్‌లో తరూర్ కారును ఆపిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. అరెస్టయిన యువకుడు కలికావు ప్రాంతానికి చెందిన ఉమర్‌గా గుర్తించారు.
థరూర్‌ను ఆపిన గుంపు ప్రయాణించిన రెండు కార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన వాండూర్‌లోని చెళ్లితోడ్ ప్రాంతంలో సాయంత్రం 7 గంటల సమయంలో జరిగింది. తరూర్, ఏపీ అనిల్ కుమార్ కోసం ప్రచారం చేయడానికి అక్కడికి వెళ్లారు.
Also Read:ఇది ప్రజాపాలన కాదు…నిరంకుశ పాలన:BRSV
ఈ దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందా లేదా అన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. దుండగులు ఉద్దేశపూర్వకంగా గందరగోళం సృష్టించడానికి వచ్చారని పోలీసులు భావిస్తున్నారు. పూర్తి విచారణ తర్వాతే అసలు కారణం వెలుగులోకి వస్తుందని అధికారులు తెలిపారు.

