ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైంది. కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అతిశీ ఘన విజయం సాధించారు. బీజేపీ అగ్రనేత రమేశ్ బిధూరిని ఓడించారు. చివరి రౌండ్ వరకు నువ్వా నేనా అన్నట్లు కౌంటింగ్ జరుగగా చివరకు రమేశ్ బిధూరిపై అతిశీ విజయం సాధించారు.
ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన కంచుకోట అయిన న్యూఢిల్లీలో ఓటమి పాలయ్యారు. మూడుసార్లు ఇదే నియోజకవర్గం నుండి గెలుపొందిన కేజ్రీవాల్ తాజాగా బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ చేతిలో ఓడిపోయారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్, వాటర్ స్కాం, అవినీతి ఆరోపణలు ఆప్ కొంపముంచాయి అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జంగ్‌పురా నియోజకవర్గం పోటీ చేసిన మనీష్ సిసోడియా తన ఓటమిని అంగీకరించారు గెలిచిన అభ్యర్థికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన ఈ నియోజకవర్గం కోసం మంచిగా పనిచేస్తారని ఆశిస్తున్నాను అని చెప్పారు.
Also Read:కేజ్రీవాల్ వల్లే ఓటమి: అన్నా హజారే