కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలోని లివర్ మోర్ శివ-విష్ణు దేవాలయంలో అతిరుద్ర మహాయజ్ఞం అంగరంగ వైభవంగా జరిగింది. 121 మంది రుత్వికులు, 35 వేదం పండితులతో మార్చి 1 ప్రారంభం అయిన మహాయజ్ఞం పదకొండు రోజుల పాటు జరగనుంది.శత చండీ సహిత అతిరుద్ర మహాయజ్ఞం లో భాగముగా,నిరంతరంగా రుద్ర పరాయనమ్ , చండి హోమములు జరిగాయి.
మొదటి రెండు రోజుల విశేషాలు
మొదటి రోజు : యాగ బ్రహ్మను స్వగతం, ఆచార్యా/రిత్విక్ వరణం , గణపతి పూజ తో మొదలైన మహాయజ్ఞం లో దీక్షా ధారణం, భూమి పూజ యాగశాల ప్రవేశం లో పాటు యోగిని వాస్తు ఖేస్త్రపాలక నవగ్రన ఆవాహన పూజలు నిర్వహించడం జరిగినది
రెండవరోజు :
దేవత మహాకాళి, మహాలష్మి, మహాసర్వసతి సహిత,సర్వతో భద్రమండల లిఙ్గతో భద్రమండల పరివార దేవత ఆవాహన పూజ మరియు మహాన్యాసం పారాయణ, 121 సార్లు రుద్ర జప అభిషేకములు ,వేదం పారాయణాలు, చండి హోమము , రుద్ర హోమం మరియు పరివార దేవత హోమములు, రుద్ర క్రమార్చన,మనో వినాయక వ్రతం నిర్వహిచారు వేదపండితులు అతిరుద్ర ప్రాసిస్త్తము వివరణ మరియు హారతి మంత్రపుష్పం తో రెండవ రోజు కార్యాక్రమాలు ముగిశాయి.
మూడవ రోజు & నాలుగవ రోజు విశేషాలు: వేదం పారాయణాలు, చండి హోమము , రుద్ర హోమం మరియు పరివార దేవత హోమములు, రుద్ర క్రమార్చన, చతుర్వేద స్వస్తి -విశేషా పూలజలయన అష్టోత్తర శత లింగ బిల్వ దళార్చన, వల్లి దేవసేన సహిత సుబ్రహ్మణ్య స్వామి వ్రతం నిర్వహించారు
ఐదవ, ఆరవ రోజు & నాలుగవ రోజు విశేషాలు: వేదం పారాయణాలు, చండి హోమము , రుద్ర హోమం, అభిషేషకాత్మక రుద్ర జపం రుద్ర క్రమార్చన, చతుర్వేద స్వస్తి మహాశివునికి అభిషేకం నిర్వహిచారు
శుక్ర, శని అది వారములలో: అష్టాదశ శక్తి పీఠ సహిత దుర్గా దీప పూజ , త్రిశక్తి కుంకుమార్చన, శివ పార్వతి కళ్యాణం , నంది వాహన సేవ తో మహాయజ్ఞం ముగుస్తుంది.బే ఏరియా చెందిన భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. భారతీయ సంసృతి ఫై కల గౌరవం ,భవితరాల వారికీ మన సంప్రదాయమును, ఆచరరాలను తెలియ పర్చుటకు అద్భుతమైన అవకాశం గా భావిస్తున్నారు. అమెరికా లో భారతీయుల ఆధ్యాత్మిక స్ఫూర్హ్టికి ఈ మహాయజ్ఞం నిదర్శనంగా నిలిచింది.