ఆర్చరీ వరల్డ్ కప్‌.. భారత్‌కు స్వర్ణాల పంట..

256
- Advertisement -

ఆర్చరీ వరల్డ్ కప్‌లో భారత్ చరిత్ర సృష్టించింది. ఇటు మహిళల టీమ్.. అటు మిక్స్‌డ్ టీమ్ రికర్వ్ ఈవెంట్‌లో టీమ్ ఇండియా స్వర్ణాలు సొంతం చేసుకుంది. ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్‌లో ఆదివారం జరిగిన వ‌ర‌ల్డ్‌క‌ప్ స్టేజ్ 3లో భార‌త మ‌హిళ‌ల రిక‌ర్వ్ టీమ్ గోల్డ్ మెడ‌ల్ గెలుచుకుంది. దీపిక కుమారి, కోమలిక బరి, అంకిత భాకట్‌తో కూడిన బృందం మెక్సికోపై 5-1 తేడాతో సునాయాస విజ‌యం సాధించింది. అంత‌కుముందు శ‌నివారం జరిగిన వ్య‌క్తిగ‌త విభాగంలో అభిషేక్ వ‌ర్మ బంగారు ప‌త‌కం సాధించారు.

- Advertisement -