అటల్‌…మీకు ‘సలాం’

50
- Advertisement -

అటల్ బిహారీ వాజ్‌పేయి..భారతదేశ రాజకీయ చరిత్రలో చెరపలేని పేరు. అపర చాణక్యుడిగా,రాజకీయ దురందురుడిగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా తన వాక్ చాతుర్యంతో దేశ ప్రజలను మెప్పించారు.గ్వాలియార్‌లోని మధ్య తరగతి బ్రాహ్మాణ కుటుంబంలో 19 2018 ఆగస్టు 16న అనారోగ్యంతో మృతిచెందారు.

1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యారు. అనతికాలంలోనే జనసంఘ్ నాయకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ అనుయాయిగా, సహాయకునిగా మారారు. 1954 లో కాశ్మీరులో కాశ్మీరేతర భారతీయ సందర్శకులను చిన్నచూపు చూస్తున్నారన్న విషయమై నిరసన ప్రకటిస్తూ ముఖర్జీ ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించినప్పుడు, వాజపేయి ఆయన వెంటే ఉన్నారు. 1957లో వాజపేయి బల్రామ్‌ఫూర్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికయ్యాడు. 1968 లో జనసంఘ్ జాతీయ అధ్యక్షునిగా ఎదిగారు.

1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేసి, 1980 నుండి 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు. 1996లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం లభించినా అది 13 రోజులకే పరిమితమైంది. 1998లో రెండో పర్యాయం ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పాలించారు. 1999లో 13వ లోక్‌సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నారు.

Also Read:గోడకుర్చీ వేస్తే.. ఇన్ని ప్రయోజనాలా!

1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది. అనారోగ్య కారణాల వల్ల క్రియాశీల రాజకీయాలనుండి తప్పుకున్నారు. ఆయన దేశానికి చేసిన విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం మార్చి 12, 2015లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. ఆయన పుట్టినరోజు అయిన డిసెంబర్ 25ను సుపరిపాలనా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. సంతానం లేని వాజపేయి, నమిత అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు.

Also Read:కళ్ళు పొడిబారుతున్నాయా..జాగ్రత్త!

- Advertisement -