నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ సినిమాల్లోకి కొత్తగా వచ్చిన రోజులు అవి. అప్పుడప్పుడే నటుడిగా ఎదుగుతున్నారు కైకాల. సహజంగా డేట్లు, ప్రొడక్షన్ వ్యవహారాలు, మేనేజర్లు ఇలా చాలా ఉంటాయని కైకాల సత్యనారాయణకి తెలియదు. ఒకపక్క నటుడిగా పేరు తెచ్చుకుంటున్నా.. మిగిలిన విషయాలు ఆయనకు వంటబట్టలేదు. కాల్షీట్లు గురించి అయితే అసలేమీ తెలిసేది కాదు. ఎక్కడ షూటింగ్ ఉందంటే అక్కడికి వెళ్లేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు కాబట్టే.. ఏ సినిమాకు ఎంత పారితోషికం తీసుకోవాలో కూడా కైకాల సత్యనారాయణకి అర్ధమయ్యేది కాదు.
సహజంగా సీనియర్ ఎన్టీఆర్ గారు ఎవరి పారితోషికం విషయంలో వేలు పెట్టరు. కానీ, కైకాల సత్యనారాయణ వాలకం ఆయన గమనిస్తూ ఉండేవారు. ఓ సినిమా కోసం నిర్మాత చక్రపాణి గారు కైకాల గారితో ‘ఆ చెప్పండి సత్యనారాయణ, 12 రోజులు పని చేశావ్. ఎంత ఇవ్వమంటావ్ ?’ అని అడిగారు. ఆ మాటకు ఏం చెప్పాలో అర్థం కాక అటూ ఇటూ చూస్తూ మొహమాట పడుతూ కూర్చున్నాడు కైకాల. అంతలో అక్కడికి వచ్చిన సీనియర్ ఎన్టీఆర్ గారు విషయం కనుక్కుని.. కైకాలని చూసి..’హా.. బ్రదర్.. ఇలా ఉంటే ఎలా బ్రతుకుతారు ? అందరూ బాగా చేస్తున్నావని చెబుతున్నారు. కానీ ఇంత అమాయకంగా ఉంటే ఎలా ?’ అని అడుగుతూ పోతున్నారు.
Also Read: #NBK108… అర్జున్ రాంపాల్ ఎంట్రీ
కైకాల ఆలోచనలు మాత్రం ‘రెమ్యునరేషన్ ఎంత తీసుకోవాలి ?’ అన్న దగ్గరే ఆగిపోయాయి. అది గమనించిన ఎన్టీఆర్ గారు ‘మొహంలో ఆలోచనలు.. ఎంత అడగాలి అనేగా.. ఇలా నసుగుతూ ఉంటే డబ్బులు రావు. సినిమా ఇండస్ట్రీలో డబ్బులు అడిగితేనే ఇవ్వరు, అలాంటిది ఇలా నసుగుతూ ఉంటే ఇక చిల్లరే సిగ్గు.. జాగ్రత్త’ అని ఎన్టీఆర్ గారే ఆ సినిమాకి పారితోషికం ఇప్పించారు. ఎంత తీసుకోవాలి కూడా కైకాల కి ఎన్టీఆర్ గారే చెప్పారు. అలా కైకాల సత్యనారాయణ తన రెమ్యునరేషన్ ను ఫిక్స్ చేసుకుని.. కొన్నాళ్ళకు పెంచుకుంటూ పోయారు.
Also Read: నెంబర్ వన్ దిశగా కృతి సనన్