ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తలపెట్టిన “గ్రీన్ ఛాలెంజ్” కార్యక్రమం రాష్ట్రం , దేశం , ఖండాంతరాలు దాటిన సంగతి విదితమే. ఆస్ట్రేలియా డిప్యూటీ మినిస్టర్ జాసన్ వుడ్‌కు టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి గ్రీన్ ఛాలెంజ్ విసరగా జాసన్ వుడ్, స్వీకరించారు. ఈ ‘గ్రీన్ ఛాలెంజ్’ కార్యక్రమం ఆవశ్యకతను తన వీడియో సందేశం ద్వారా తెలంగాణ సమాజానికి అందించి, ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని తలపెట్టిన సంతోష్ కుమార్‌ను అభినందించారు.
నాగేందర్ రెడ్డికి స్వయంగా మొక్కను అందించిన జాసన్ వుడ్ ఇటువంటి సామాజిక స్పృహ ఉన్న కార్యక్రమంలో తనను భాగస్వామ్యం చేసినందుకు నాగేందర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి, ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజక్టు గురించి తెలుసుకుని జాసన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణకు వచ్చి తన కళ్లారా కాళేశ్వరం ప్రాజక్టును చూస్తానని జాసన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడ్వైసరి బోర్డు చైర్మన్ డా అనిల్ కుమార్ చీటీ , విక్టోరియా స్టేట్ ఇంచార్జి సాయిరాం ఉప్పు ,నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ సాయి యాదవ్ లతో పాటు ఆస్ట్రేలియా లిబరల్ నాయకులు పాల్గొన్నారు.
#GreenIndiaChallenge goes international!! It’s an honour that @jasonWood_MP Australia recognised this initiative and supported us. @KNRTRSAUSTRALIA#INDIA
#Australia
#Telangana #Hyderabad #HaraHaiTohBharaHai
pic.twitter.com/Q3DAxq7qXa
— Santosh Kumar J (@MPsantoshtrs) November 10, 2019