నామినేషన్ దాఖలు చేసిన అసోం సీఎం…

244
assam
- Advertisement -

మజులీ అసెంబ్లీ స్ధానం నుండి బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు అసోం ముఖ్య‌మంత్రి స‌ర్బానంద సోనోవాల్‌.నేటితో నామినేషన్ గడువు ముగియనుండటంతో భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు సోనోవాల్.

అంత‌కుముందు భారీ ర్యాలీ నిర్వ‌హించిన ఆయ‌న ఆ ర్యాలీకి హాజ‌రైన ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. మ‌జులీ ప్ర‌జ‌లు మ‌రోసారి త‌న‌ను ఆశీర్వ‌దించాల‌ని కోరారు. మ‌ళ్లీ అవ‌కాశ‌మిస్తే ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ ఆధ్వ‌ర్యంలో రాష్ట్రాన్ని మ‌రింత అభివృద్ధి చేస్తాన‌ని ఆయ‌న చెప్పారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా సోనోవాల్ ఇదే స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక‌య్యారు.

- Advertisement -