అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శ‌ర్మ..

52
Himanta Biswa Sarma

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ బాధ్యతలు చేపట్టబోతున్నారు. బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ లీడ‌ర్‌గా హిమంత‌ను ఎన్నికైన‌ట్లు కేంద్ర మంత్రి, బీజేపీ నేత న‌రేంద్ర సింగ్ తోమార్ వెల్ల‌డించారు. ఆదివారం బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ స‌మావేశాన్ని నిర్వ‌హించారు. దీనికి బీజేపీ ప‌రిశీల‌కులుగా తోమార్‌తోపాటు బీజేపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అరుణ్ సింగ్ కూడా హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశం సంద‌ర్భంగా సీఎం రేసులో ఉన్న స‌ర్బానంద సోనోవాలే.. హిమంత బిశ్వ శ‌ర్మ పేరును ప్ర‌తిపాదించారు. అంత‌కుముందే ఆయ‌న రాజ్‌భ‌వ‌న్‌కు వెళ్లి ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు.