ఆసియా కప్ విజేతగా భారత్..

32
- Advertisement -

ఆసియా కప్ విజేతగా నిలిచింది భారత్. ఫైనల్లో ఇప్పటివరకు ఓటమి ఎరుగని శ్రీలంకను 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. 51 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 6.1 ఓవర్లలో వికెట్ కొల్పోకుండా లక్ష్యాన్ని చేధించింది.ఇసాన్ కిషన్ 23 పరుగులు చేయగా గిల్ 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

ఇక అంతకముందు టాస్ గెలిచిన శ్రీలంక బ్యాటింగ్ ఎంచుకుంది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో వికెట్ కొల్పోయింది శ్రీలంక. ఇక నాలుగో ఓవర్‌లో సిరాజ్ రూపంలో మంచి బ్రేక్ దొరికింది భారత్‌కి ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసి శ్రీలంక టాప్ ఆర్డర్‌ని దెబ్బతీశాడు. తర్వాత అదే జోరు కంటిన్యూ చేస్తూ మరో రెండు వికెట్లు తీయగా మొత్తం 6 వికెట్లు తీసి తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు.

ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో తొలి బంతికే నిసాంక (2)ను పెవిలియన్ చేర్చగా మూడో బంతికి సమరవిక్రమ (0), నాలుగో బంతికి అసలంక (0), ఆరో బంతికి ధనుంజయ (4)ను పెవిలియన్ చేర్చాడు. దీంతో 8వ సారి ఆసియా కప్ విజేతగా నిలిచింది భారత్.

Also Read:పుష్ప 2 వెనక్కి తగ్గాల్సిందేనా ?

- Advertisement -