టీమ్‌ఇండియా ఆసియాకప్‌లో ఆఖరి పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే ఫైనల్లో బంగ్లాదేశ్‌ను ఢీకొంటుంది. భారత్ మంచి ఫామ్‌లోనే ఉన్నా ప్రత్యర్థిని తేలిగ్గా తీసుకుంటే పొరపాటే. ఎంతో నిలకడైన జట్లు కూడా ఫైనల్లో బోల్తా కొట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి గ్రూప్ దశలో బంగ్లాపై గెలిచి ఉన్నా.. టీమ్‌ఇండియాకు ఉదాసీనత పనికిరాదు. టోర్నీలో ప్రదర్శన గొప్పగా లేకపోయినా తనదైన రోజున ఎలాంటి జట్టునైనా బంగ్లా ఓడించగలదు.
గత కొన్నేళ్లలో మైదానంలో ఈ రెండు జట్ల వైరం పెరిగిన నేపథ్యంలో ఫైనల్ ఆసక్తి రేపుతోంది. రోహిత్ బృందం ఆఖరి సమరానికి పట్టుదలగా సిద్ధమైంది. అఫ్గానిస్థాన్‌తో టైగా ముగిసిన మ్యాచ్‌లో ఐదుగురు కీలక ఆటగాళ్లు విశ్రాంతినిచ్చిన భారత్.. ఫైనల్లో పూర్తిగా స్థాయి జట్టుతో బరిలోకి దిగనుంది.
తుది జట్లు (అంచనా).. భారత్: శిఖర్ ధావన్, రోహిత్ శర్మ, అంబటి రాయుడు, దినేశ్ కార్తీక్, ధోని, కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, కుల్‌దీప్, యుజ్వేంద్ర చాహల్, జస్‌ప్రీత్ బుమ్రా.
బంగ్లాదేశ్: లిటన్ దాస్, సౌమ్య సర్కార్, మొమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, మహ్మద్ మిథున్, ఇమ్రుల్ కయెస్, మహ్మదుల్లా, మష్రఫె మొర్తజా, మెహదీ హసన్, రుబెల్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహమాన్.