అక్టోబర్ 11న ‘అరవింద సమేత వీర రాఘవ’..

248
Aravinda Sametha
- Advertisement -

త్రివిక్రమ్,ఎన్టీఆర్ కాంబినేషన్లో ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా నిర్మితమైంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా, ఓ ముఖ్య పాత్ర కోసం ఈషా రెబ్బని ఎంపిక చేశారు. ఈ సినిమాపై అందరిలోను భారీ అంచనాలు వున్నాయి. డిఫరెంట్ లుక్స్‌తో ఈ సినిమాలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు. రాయలసీమ నేపథ్యంలో సాగే ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 11వ తేదీన విడుదల చేయనున్నట్టు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే.

Aravinda Sametha

అయితే అర‌వింద స‌మేత చిత్రం ద‌స‌రా కానుక‌గా విడుద‌ల అవుతుంద‌ని తెలిసిన క‌రెక్ట్ డేట్ ఎప్పుడు అనే క్లారిటీ లేక‌పోయింది. తాజాగా చిత్ర యూనిట్ పోస్ట‌ర్స్ ద్వారా అఫీషియ‌ల్ రిలీజ్ డేట్ ప్ర‌క‌టించారు. అక్టోబ‌ర్ 11న ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బేనర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -