దాయాదుల పోరు..నెగ్గేదెవరు?

62
- Advertisement -

ఆసియా కప్‌ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. తొలి మ్యాచ్‌ శ్రీలంక – ఆఫ్ఘానిస్తాన్‌ మధ్య జరగనుండగా అందరి కళ్లు దాయాదుల పోరుపైనే ఉన్నాయి. ఈ హై ఓల్టేజ్‌‌‌‌ మ్యాచ్ ఆదివారం జరగనుంది. గతేడాది జరిగిన టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో ఇరుదేశాలు చివరిసారి తలపడ్డాయి. కానీ ఎప్పుడూ లేని విధంగా వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో ఫస్ట్‌‌‌‌ టైమ్‌‌‌‌ పాకిస్తాన్‌‌‌‌ ఆ మ్యాచ్‌‌‌‌లో విజయం సాధించింది. దీంతో ఇప్పుడు టీమిండియా ప్రతీకారం కోసం ఎదురుచూస్తోంది.

2007 టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో తొలిసారి ఇండో–పాక్‌‌‌‌ పోరు జరిగింది. స్కోర్లు టై కావడంతో నిర్వహించిన బౌల్‌‌‌‌ అవుట్‌‌‌‌లో ఇండియా విజయం సాధించి మెగా కప్‌‌‌‌ను సొంతం చేసుకుంది. పాక్​పై విరాట్‌‌‌‌కు సూపర్‌‌‌‌ రికార్డు ఉంది. 7 ఇన్నింగ్స్‌‌‌‌లో 77.75 యావరేజ్‌‌‌‌తో 311 రన్స్‌‌‌‌ చేశాడు. ఇందులో మూడు హాఫ్‌‌‌‌ సెంచరీలు ఉన్నాయి.

- Advertisement -