పాకిస్థాన్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో విజయం సాధించి ఫైనల్‌కు చేరుంది శ్రీలంక. వర్షం కారణంగా 42 ఓవర్లకు మ్యాచ్ కుదించగా తొలుత బ్యాటింగ్ చేసిన పాక్..7 వికెట్లు కొల్పోయి 252 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంక..42 ఓవర్లలో 8 వికెట్లు కొల్పోయి 253 పరుగులు చేసింది. కుషాల్ మెండిస్ (91), సమరవిక్రమ (48), అసలంక (49 నాటౌట్) రాణించారు. దీంతో పాకిస్థాన్‌ను రెండు వికెట్ల తేడాతో ఓడగొట్టింది శ్రీలంక.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ టాప్ ఆర్డర్ విఫలమైన లోయర్ ఆర్డర్‌లో మహమ్మద్ రిజ్వాన్ 86, అబ్దుల్లా షఫీఖ్ 52 పరుగులతో రాణించడంతో 252 పరుగులు చేసింది. ఓ దశలో పాక్ 200 పరుగులు దాటుతుందా అని భావించిన వీరిద్దరు ఆచితూచి ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించారు. చివర్లో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకపడటంతో పాక్ గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. దీంతో ఆదివారం భారత్‌తో తుదిపోరులో తలపడనుంది శ్రీలంక.
Also Read:Harishrao:ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే