దాయాదుల పోరు..డేగ కళ్లతో నిఘా

230
india vs pakisthan
- Advertisement -

క్రికెట్‌లో అసలు సిసలు మజాను ఆస్వాదించాలంటే కొన్ని దేశాల మధ్య జరిగే మ్యాచ్‌లు చూడాల్సిందే. వాటిలో భారత్-పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు. గతేడాది జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత ఇరు దేశాలు మళ్లీ తలపడలేదు. సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కారణంగా భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌లు నిర్వహించడానికి భారత ప్రభుత్వం బీసీసీఐకి అనుమతి నిరాకరించింది.

ఈ నేపథ్యంలో యుఏఈ వేదికగా బుధవారం జరగనున్న మ్యాచ్‌ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్‌ కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. మ్యాచ్ చూడటానికి అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం సన్నిహితుడు హాజరవుతున్నాడనే సమాచారంతో వివిధ దేశాలకు చెందిన ఇంటలిజెన్స్‌ ఏజెన్సీలు అప్పమత్తమయ్యాయి.

ముంబై, కరాచీ నగరాల నుంచి దావుద్ కుటుంబ సభ్యులు, బంధువులు మ్యాచ్ చూడటం కోసం దుబాయ్‌ వెళ్లారు. దీంతో భారత్, బ్రిటన్, అమెరికా, రష్యా, చైనాలకు చెందిన ఇంటెలిజెన్స్ అధికారులు ఈ మ్యాచ్‌పై నిఘా పెట్టారు.

ఐసీసీ టోర్నీల్లో పాకిస్తాన్‌పై భారత్‌కి తిరుగులేని రికార్డ్‌ వుంది. ఆ లెక్కన, భారత్‌ గెలుపు నల్లేరు మీద నడకేనన్నది క్రికెట్‌ విశ్లేషకుల వాదన. ఇక ఒత్తిడిలో రాణించడం పాక్‌ ప్రత్యేకత. చాలా సందర్భాల్లో ఒత్తిడిని తట్టుకుని భారత్‌పై పైచేయి సాధించింది పాక్‌. గతేడాది జరిగిన ఐసీసీ ఛాంపియన్‌ ట్రోఫీలో భారత్‌కి మట్టికరిపించింది పాక్.

- Advertisement -