ప్రతి ఒక్కరూ విత్తన గణపతిని పూజించాలి:అశ్వినీ దత్

363
ashwinidath
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ద్వారా వినాయక చవితి సందర్భంగా శ్రీకారం చుట్టిన విత్తన గణపతి పంపిణీ కార్యక్రమానికి అపూర్వ స్పందన వస్తుంది.

నానక్ రామ్ గూడ లోని తన నివాసంలో సినీ నిర్మాత అశ్వినీ దత్ కి గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు విత్తన గణపతిని పంపిణీ చేశారు.
ఈ వినాయక చవితికి విత్తన గణపతిని పూజించడం చాలా సంతోషంగా ఉందని విత్తన గణపతి పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కు అశ్వినిదత్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రతి ఒక్కరు విత్తన గణపతిని పూజించాలని పిలుపునిచ్చారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంబించిన హరితహారం స్పూర్తితో ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతంగా ముందుకు వెళుతుందని ఎంపీ సంతోష్ కుమార్ ను అశ్వినిదత్ అభినందించారు.

- Advertisement -