అదరహో…. అశ్విన్

409
- Advertisement -

భారత్ క్రికెట్ జట్టు ప్రధాన బలం స్పీన్‌ బౌలింగే. ఫేస్ త్రయం విఫలమైన ప్రతిసారి…స్పీన్నర్లే మ్యాచ్‌ విన్నర్లుగా మారి ఎన్నో చరిత్రాత్మక విజయాలను అందించిన సందర్భాలున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే స్పీన్‌ భారతబలం.అందుకే ఫేస్ బౌలర్లను నామమాత్రంగా ఉంచి…స్పీన్‌ బౌలింగే ఆయుధంగా బరిలోకి దిగి గెలిచిన సందర్భాలు కోకోల్లలు. నాటి ప్రసన్న,వెంకటపతిరాజు దగ్గరి నుంచి కుంబ్లే,భజ్జీ,అశ్వీన్ వరకు ఎన్నో విజయాల్లో కీలకపాత్ర పోషించి భారత స్పీన్ బౌలింగ్ సత్తాను చాటారు.

Ashwin

తాజాగా రవించంద్రన్ అశ్విన్…భారత జట్టుకు ప్రధాన ఆటగాడిగా మారాడు. స్పీన్‌ బౌలర్‌గా జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన అశ్విన్…ఆల్‌ రౌండర్‌గా మారి జట్టును అనేక సందర్భాల్లో ఆదుకున్నాడు.1973 తరువాత ఓ అరుదైన ఘనతను సాధించిన భారతీయ క్రికెటర్ గా రవిచంద్రన్ అశ్విన్ నిలిచాడు. 2015 సంవత్సరాన్ని నంబర్ వన్ బౌలర్ గా, నంబర్ వన్ ఆల్ రౌండర్ గా నిలిచి రికార్డును సొంతం చేసుకున్నాడు. సొంతగడ్డపైనే కాదు..విదేశాల్లో కూడా తన స్పీన్‌కు ఎదురు లేదని నిరుపిస్తూ భారత్‌కు చిరస్మరణీయ విజయాలను అందించాడు.

ashwin roars     ashwin

తాజాగా చ‌రిత్రాత్మ‌క 500వ టెస్టు విజ‌యంలో స్పిన్న‌ర్ అశ్విన్ కీల‌క పాత్ర పోషించాడు. కివీస్‌తో నాలుగో రోజు ఆట సంద‌ర్భంగా 200వికెట్ల క్ల‌బ్‌లో చేరి స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు అశ్విన్‌. ఈ ఘ‌న‌త‌ను కేవ‌లం 37 టెస్టుల్లోనే సాధించాడు. దీంతో ప్ర‌పంచంలోనే అతి తక్కువ మ్యాచుల్లో 200వ వికెట్ల క్లబ్‌లో చేరిన రెండ‌వ ఆట‌గాడిగా చ‌రిత్ర‌కెక్కాడు. అశ్విన్ కంటే ముందు భారత్‌ నుంచి హర్భజన్ సింగ్ 46 టెస్టుల్లో 200 వికెట్లు తీసుకున్నాడు.

aswin  Indias-captain-Virat-Kohli-R-and-teammate-Ravichandran-Ashwin

రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాత గత ఐదేళ్లలో భారత్ 7 టెస్టు సిరీస్‌లు నెగ్గింది. అందులో 6 సార్లు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు అతనికే దక్కిందంటే మన విజయాల్లో అశ్విన్ పాత్ర ఏమిటో అర్థమవుతుంది. పేస్ బౌలింగ్‌కు స్వర్గధామంగా నిలచే కరేబియన్‌ పిచ్‌లపై తన స్పీన్ మాయాజాలాన్ని పదర్శించాడు అశ్విన్. సొంతగడ్డపై సఫారీలకు చుక్కలు చూపించాడు.

తొమ్మిదేళ్లుగా విదేశాల్లో అజేయ జట్టుగా వెలుగుతున్న దక్షిణాఫ్రికాను ఒక్కసారిగా నేలకుదించాడు. సఫారీలపై భారత్‌కు 11 సంవత్సరాల తర్వాత తొలి సిరీస్ విజయాన్ని అందించాడు.భారత్‌ను విజయపథంలో నడిపే క్రమంలో అశ్విన్ పలు వ్యక్తిగత రికార్డులను అందుకున్నాడు. ఒకే క్యాలండర్ ఇయర్‌లో 50 లేదా అంతకంటే ఎక్కువ టెస్టు వికెట్లు కూల్చిన ఏడో భారత బౌలర్‌గా అతను రికార్డు పుస్తకాల్లోకి ఎక్కాడు. హర్భజన్ సింగ్, అనిల్ కుంబ్లే చెరి మూడు పర్యాయాలు ఈ ఫీట్‌ను సాధించారు.

ravichandran-ashwin ravichandran-ashwin

టెస్టుల్లో ఒక భారత స్పిన్నర్ అత్యంత వేగంగా 50 టెస్టు వికెట్లను పడగొట్టడం ఇదే మొదటిసారి. 1962లో వినూ మన్కడ్ తొమ్మిది టెస్టుల్లో 50 వికెట్ల మైలురాయిని చేరితే, అశ్విన్ తన ఎనిమిదో టెస్టులోనే యాభై వికెట్లను పూర్తి చేయగలిగాడు. ఒక క్యాలండర్ ఇయర్‌లో ఆరుసార్లు ఒక్కో ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన నాలుగో బౌలర్‌గా అశ్విర్ రికార్డు నెలకొల్పాడు. 1955లో సుభాష్ గుప్తే, 2001లో హర్భజన్ సింగ్, 2004లో అనీల్ కుంబ్లే ఈ ఘనతను సాధించారు.

ఒక క్యాలండర్ ఇయర్‌లో ఆరు లేదా అంతకంటే ఎక్కువ సార్లు ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో ఐదు లేదా అంతకు మించి వికెట్లు పడగొట్టిన బౌలర్ల జాబితాలో అశ్విన్‌కు 22వ స్థానం లభిస్తుంది. మాల్కం మార్షల్, ముత్తయ్య మురళీధరన్ ఒక క్యాలెండర్ ఇయర్‌లో చెరి తొమ్మిది పర్యాయాలు ఐదుకు మించి వికెట్లు కూల్చారు. క్రికెట్‌లో సహజంగా కొత్త బంతితో పేసర్లు బౌల్ చేస్తే, బంతి పాతపడిన తర్వాత స్పిన్నర్లు రంగంలోకి దిగుతారు. అయితే, టెస్టు చరిత్రలోనే కొత్త బంతితో ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌ను వేసి, ఎనిమిది వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా అశ్విన్ పేరు చరిత్ర పుస్తకాల్లో ఉంది. కొలిన్ బ్లైత్ (ఇంగ్లాండ్), హ్యూస్ ట్రంబుల్ (ఆస్ట్రేలియా) సరసన అతనికి స్థానం దక్కింది.

- Advertisement -