క్రికెట్‌లో సూపర్‌స్టార్ కల్చర్‌..అశ్విన్ ఫైర్!

2
- Advertisement -

భారత క్రికెట్‌లో పెరుగుతున్న “సూపర్‌స్టార్ కల్చర్”పై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో కనిపించే “ఫ్యాన్ ఆర్మీలు” ప్రచారం చేస్తున్న అభిప్రాయాలు కొన్నిసార్లు లోపలి వ్యక్తుల నుంచే వస్తున్నాయేమో అన్న అనుమానం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని ఆయన ఒక వ్యాధి గా అభివర్ణించారు.

ఈ విషయంలో ఇప్పటికే సునీల్ గవాస్కర్, కోచ్ గంభీర్ కూడా ఈ ధోరణిని తీవ్రంగా విమర్శించారు. ఆశ్విన్ మాట్లాడుతూ…సోషల్ మీడియాలో కనిపించే కొన్ని అభిప్రాయాలు నేను ముందే వ్యక్తిగతంగా వినాను. ఉదయం అల్పాహారం లేదా భోజన సమయంలో వినిపించిన మాటలు, తర్వాత సోషల్ మీడియాలో వేరే పేరుతో కనిపిస్తున్నాయి. ఇది ఎలా జరుగుతోంది అనిపిస్తుంది అన్నారు.

Also Read:వినూత్నంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రమోషన్స్

ప్రతి ఆటగాడు ఇప్పుడు ఒక బ్రాండ్‌లా మారిపోయాడని, తమ ఇమేజ్‌ను పెంచుకునేందుకు ఈ విధంగా అభిప్రాయాలను బయటకు పంపించే వ్యవస్థ ఉందేమో అనిపిస్తోందన్నారు. అయితే, ఇతర ఆటగాళ్లను దూషించడం మాత్రం తాను ఎప్పుడూ చేయనని స్పష్టం చేశారు. ఇప్పుడు క్రికెట్ కంటే వ్యక్తుల గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. ఆట అసలు సారాంశం మరిచిపోయాం అని ఆశ్విన్ అన్నారు.

- Advertisement -