- Advertisement -
కాంగ్రెస్ అధ్యక్ష పదవికి త్వరలో నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. కేరళలో భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీని కలిసిన అనంతరం గెహ్లాట్ మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాలని ఎన్నో సార్లు రాహుల్ గాంధీని కోరానని, అయితే ఈసారి గాంధీ ఫ్యామిలీ నుంచి ఎవరూ అధ్యక్ష స్థానానికి పోటీపడరని రాహుల్ తనకు చెప్పినట్లు గెహ్లాట్ స్పష్టం చేశారు.
త్వరలోనే కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తానని… విపక్షాలు పటిష్టంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని, ప్రస్తుతం దేశం ఏ స్థితిలో ఉందో గమనించాలన్నారు. ఒకవేళ తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపడితే ఆ తర్వాత చేయాల్సిన కార్యక్రమాలను అజయ్ మాకెన్,సోనియా గాంధీ చూసుకుంటారని వెల్లడించారు.
ఆక్టోబర్ 17వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
- Advertisement -