Ashok Gehlot:తిరుగులేని రాజకీయ నేత

39
- Advertisement -

ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా పాలిటిక్స్‌లో అంచెలంచెలుగా ఎదిగిన నేత అశోక్ గెహ్లాట్. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం దగ్గరి నుండి ఎమ్మెల్యే,ఎంపీ,మంత్రిగా,కేంద్రమంత్రిగా,సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం రాజస్థాన్ ముఖ్యమంత్రిగా మూడోసారి కొనసాగుతున్నారు గెహ్లాట్.

1951 మే3న జన్మించారు గెహ్లాట్. తండ్రి లక్ష్మణ్ సింగ్ వృత్తిరిత్యా మేజిషియన్. న్యాయవిద్య మ‌రియు సైన్స్‌ల‌లో ఆయ‌న గ్రాడ్యుయేష‌న్‌తో పాటు ఎకనామిక్స్‌లో మాస్ట‌ర్స్ డిగ్రీ సాధించారు. మహాత్మా గాంధీ బోధనల ద్వారా ప్రభావితుడైన గెహ్లోట్ తన చిన్నతనంలోనే కాంగ్రెస్ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు. 1971లో పశ్చిమ బెంగాల్ శరణార్ధులకు సహాయం అందించే కార్యక్రమాలలో పాల్గొన్నారు. తర్వాత రాజస్ధాన్ ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడిగా నియమితులయ్యారు.

తొలిసారిగా సర్దార్ పురా నియోజకవర్గం నుండి 1977లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. తర్వాత 1980లో జోధ్ పూర్ నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి 52,519 ఓట్ల తేడాతో విజయం సాధించి కేంద్రమంత్రి అయ్యారు. 1991లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చినప్పుడు అప్పటి ప్రధాని పి.వి.నరసింహారావు హయాంలో మళ్లీ కేంద్ర మంత్రిగా నియమితులయ్యారు. 1998లో రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ 200 సీట్లలో 153 స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఘన విజయం సాధించింది. అశోక్ గెహ్లాట్ తొలిసారిగా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2008 లో కాంగ్రెస్ తిరిగి గెలుపొందిన తరువాత గెహ్లోట్ రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు.

Also Read:కేసీఆర్ రియల్ హీరో..వైసీపీ ఎమ్మెల్యే ప్రశంసలు

2018 లో స‌ర్థార్‌పుర సీటు నుంచి గెలిచారు. బీజేపీకి చెందిన శంభుసింగ్‌పై ఆయ‌న 45,597 ఓట్ల తేడాతో గెలిచారు. దీంతో మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉచిత అంబులెన్సు సేవ‌లు మ‌రియు రాజీవ్ గాంధీ మెమోరియ‌ల్ బుక్ బ్యాంక్ వారిచే ఉచితంగా పుస్త‌కాల‌ను పంపిణీ చేసే భార‌త్ సేవా సంస్థాన్‌ను అశోక్ గెహ్లోట్ స్థాపించారు. రాజస్థాన్ రాజకీయాల్లో తిరుగులేని నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు గెహ్లాట్. ఓ దశలో కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేయగా గెహ్లాట్ పేరు సైతం ప్రస్తావనలోకి వచ్చిందంటే అది ఆయన రాజకీయ దక్షతకు నిదర్శనం.

Also Read:Asthama:ప్రపంచ ఆస్తమా దినోత్సవం

- Advertisement -