- Advertisement -
రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి కేటీఆర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీఆర్ చొరవతో పలు అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురాగా తాజాగా అమెరికాకు చెందిన మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని ప్రశంసల జల్లు కురిపించారు.
20 ఏండ్ల తర్వాత కేటీఆర్ భారతదేశానికి ప్రధాని అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కేటీఆర్‌కు అన్ని అంశాలపై స్పష్టమైన అవగాహన, భావ వ్యక్తీకరణ ఉన్న ఇలాంటి యువ రాజకీయ నాయకుడిని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు.
తెలంగాణకు బిలియన్ డాలర్ల పెట్టుబడులు తీసుకెళ్లే విధంగా కేటీఆర్ చొరవ ఉందని, , తనకు సిలికాన్ వ్యాలీ స్టార్టప్ రోజులు గుర్తుకు వస్తున్నాయని ఆశా పేర్కొన్నారు.
- Advertisement -