నులిపురుగుల సమస్యను ఇలా గుర్తించండి!

30
- Advertisement -

కొందరిలో మలవిసర్జన చేసినప్పుడు చిన్న చిన్న పురుగులు కనిపిస్తూ ఉంటాయి. వీటినే నులిపురుగులు అంటారు. ఈ నులిపురుగుల సమస్య చిన్న పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ సమస్య ఉన్నవారికి కడుపులో నొప్పి, మలద్వారం వద్ద దురద, ఆకలి మందగించడం, మలబద్దకం వంటి సమస్యలు కనిపిస్తాయి. అయితే మలం ద్వారా బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఈ పుగులను గుర్తిస్తుంటారు చాలమంది. నిజానికి ఇవి పొట్టలో చేరిన తర్వాత గుడ్లు పెడుతూ వృద్ది చెందుతాయి. వీటి సంఖ్య మరి ఎక్కువైనప్పుడు డయేరియా లక్షణాలు కనిపిస్తాయి. అప్పటికి కూడా వీటి విషయంలో జాగ్రత్త వహించకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. .

కడుపులో నులిపురుగుల వృద్ది జరుగుతున్నప్పుడు పొత్తి కడుపులో నొప్పి రావడం, మలవిసర్జన సరిగా జరగకపోవడం, మలంలో చిన్న చిన్న తోక పురుగులు కనిపించడం, కొందరిలో ఏలిక పాములు, కొరడా పురుగులు కనిపించడం జరుగుతుంది. ఇంకా ఆకలి మందగించడంతో పాటు, అలసట, బద్దకం, తరచూ కడుపు నొప్పి, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలను గుర్తించి సరైన వైద్యం తీసుకుంటే నులిపురుగుల సమస్యను తగ్గించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇంతకీ ఈ నులిపురుగులు కడుపులోకి ఎలా వస్తాయంటే.. మట్టి ద్వారా కడుపులోకి చేరతాయి. చిన్న పిల్లలు మట్టిలో ఆడుకొని చేతులు కడుక్కోకుండా ఆహారాన్ని తిన్నప్పుడు నులిపురుగులు ఏర్పడతాయి. ఇంకా కలుషితమైన ఆహారం, సరిగా కడగని మాంసం తిన్నప్పుడు లేదా పచ్చి మాంసం తిన్నప్పుడు కూడా నులిపురుగులు వేగంగా కడుపులో వృద్ది చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపించే ఈ సమస్య విషయంలో తల్లిదండ్రులు ఎంతో జాగ్రత్త వహించాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read:విక్రమ్.. “తంగలాన్”

- Advertisement -