అసని ఎఫెక్ట్…భారీ వర్షం

36
rains
- Advertisement -

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసాని తుపాను కృష్ణాజిల్లా సమీపంలో తీరాన్ని దాటినట్లుగా వాతావరణ అధికారులు వెల్లడించారు. భూభాగాన్ని తాకడంతో బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారిందని దీని ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

రెండు రోజుల పాటు దక్షిణకోస్తాలో పలు చోట్ల తేలిక పాటి , మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. అత్యవసర సహాయం కోసం 1070, 18004250101 నెంబర్లకు కాల్ చేయాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించారు అధికారులు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కోస్తా తీర ప్రాంతంలో రెడ్ అలెర్ట్ కొనసాగుతుందని ప్రభుత్వం ప్రకటించింది. మచిలీపట్నం – విశాఖపట్నం – నిజాంపట్నం – కాకినాడ – గంగవరం పోర్టుల్లో చేసిన 7వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు కొనసాగుతున్నాయని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

- Advertisement -