రివ్యూ : సర్కార్ వారి పాట

397
review
- Advertisement -

గీతాగోవిందం ఫేమ్ పరుశరామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. భారీ అంచనాల మధ్య ఇవాళ సినిమా ప్రేక్షకుల ముందుకురాగా మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. మహేశ్‌ సరసన కీర్తి సరేశ్ హీరోయిన్‌గా నటించగా ఈ సినిమాతో మహేశ్‌ మెప్పించాడా లేదా చూద్దాం..

కథ:

అమెరికాలో ఓ కంపెనీని నడుపుతుంటాడు మహేష్. కాసినోకు బానిసైన కీర్తి సురేష్ తన నేపథ్యం గురించి అబద్ధాలు చెప్పి మహేష్ నుండి భారీగా డబ్బులు తీసుకుంటుంది. తాను మోసపోయానని గ్రహించిన మహేష్ బాబు …ఆమె తండ్రి రాజేంద్రనాథ్ (సముద్రఖని) నుండి అప్పు వసూలు చేయడానికి భారతదేశానికి వస్తాడు. తర్వాత ఏం జరుగుతుంది…?ఇండియాకు వచ్చిన తర్వాత మహేశ్‌లో కనిపించే మార్పు ఏంటీ..? తర్వాత ఏం జరుగుతుంది అన్నదే సినిమా కథ.

ప్లస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్స్ మహేష్‌బాబు వన్ మ్యాన్ షో, కామెడీ,ఫస్టాఫ్, పాటలు. మహేశ్ బాబు నటన సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. వన్ మ్యాన్ షోతో ఇరగదీశాడు. మహేశ్ తప్ప ఈ పాత్రకు ఎవరూ సెట్ కారు అనేంతలా జీవించేశాడు. ఇక కీర్తి సురేశ్ సినిమాకు మరో ప్లస్ పాయింట్. తన నటనతో ఆకట్టుకుంది. మిగితా నటీనటులు తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు.

మైనస్ పాయింట్స్‌:

సినిమాలో మేజర్ మైనస్ పాయింట్స్ పేలవమైన కథ, సెకండాఫ్ ఫ్లాట్ నేరేషన్, భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ గురించి అనవసరమైన బోధించే సన్నివేశాలు.

సాంకేతిక విభాగం:

సాంకేతికంగా సినిమా సూపర్బ్. తమన్ సంగీతం బాగుంది. ముఖ్యంగా పాటలు ప్రేక్షకులను మెప్పించాయి. ఆర్.మది సినిమాటోగ్రఫీ చాలా బాగుండగా ఎడిటింగ్ పర్వాలేదు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ మరియు GMB కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడంతో సినిమాకు మరింత రిచ్‌నెస్ తీసుకొచ్చాయి.

తీర్పు:

సర్కార్ వారి పాట..పక్కా కమర్షియల్ మూవీ. మహేశ్‌ నటన, పాటలు,ఫస్టాఫ్ సినిమాకు ప్లస్ కాగా సెకండాఫ్‌ ఫ్లాట్ నేరేషన్ మైనస్ పాయింట్స్. ఓవరాల్‌గా ఈ వీకెండ్‌లో చూడదగ్గ చిత్రం సర్కారు వారి పాట.

విడుదల తేదీ: 12/5/2022
రేటింగ్:2.75/5
నటీనటులు:మహేశ్‌ బాబు, కీర్తి సురేశ్‌
సంగీతం: తమన్
నిర్మాత: మైత్రీ మూవీ మేకర్స్,14 రీల్స్ ప్లస్
దర్శకత్వం: పరుశరామ్

- Advertisement -