మోహన్ భగవత్‌కు అసద్ కౌంటర్

79
- Advertisement -

ముస్లింలు జనాభ నియంత్రణపై ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై స్ట్రాంగ్ కౌంటరిచ్చారు మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ. భగవత్ సాహబ్ నేను మిమ్మల్ని ఖురాన్ చదవమని ఆహ్వానిస్తున్నాను. పిండాన్ని చంపడం చాలా పెద్ద పాపమని అల్లా మాకు చెబుతున్నాడు. రెండు గర్భాల మధ్య అంతరాన్నిముస్లింలు చేస్తారు. కండోమ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తారని అన్నారు.

మీరు బాధపడకండి, ముస్లిం జనాభా పెరగడం లేదు, తగ్గుతోంది.. ఎందుకంటే కండోమ్‌లు మేము ఎక్కువగా వినియోగిస్తున్నాం అని చురకలు అంటించరు. మోహన్ భగవత్ దీనిపై మాట్లాడరు అంటూ హైదరాబాద్ లో జరిగిన ఒక సభలో అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు.

- Advertisement -