తెలంగాణ బీజేపీ నేతలకు షాకిచ్చింది ఆ పార్టీ అధిష్టానం. అసెంబ్లీలో ఇంఛార్జ్‌లుగా వ్యవహరిస్తున్న వారు ఎన్నికల్లో పోటీ చేసే వీలులేదని తేల్చిచెప్పారు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ బన్సల్. పార్టీ నిర్ణయించిన అభ్యర్థులే పోటీలో ఉంటారని, పార్టీ గెలుపు కోసం పని చేయాలని చెప్పడంతో అసెంబ్లీ ఇంచార్జ్ లు అసంతృప్తి వ్యక్తం చేశారు.
తమను ఇంఛార్జీ పదవుల నుండి తొలగించాలని సమావేశంలో పట్టుబట్టగా వారి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు బీజేపీ నేతలు. అయితే ఇంఛార్జ్‌లు మాత్రం వెనక్కి తగ్గలేదు. దీంతో బీజేపీ నేతలకు ఇప్పుడు కొత్త తలనొప్పి ఎదురైంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో నియోజకవర్గ ఇంచార్జులుగా కష్టపడుతున్న తమను కాదంటే ఎలా అని గట్టిగా ప్రశ్నించారు. ఇంచార్జీల్లో చాలా మంది తమను పదవుల నుంచి తొలగించాలని కోరగా పార్టీ నేతలు మాత్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

