అల్లు అర్జున్ ‘ఆర్య’ @17..

301
arya
- Advertisement -

టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్ కెరియర్‌లో చెప్పుకోదగిన సినిమాల్లో ‘ఆర్య’ ఒకటి. మొదటిసారిగా వన్ సైడ్ లవ్ అంటూ ఓ కొత్తరకం కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సినిమాలో అన్ని కొత్తగానే ఉంటాయి. ఈ సినిమాతో అల్లు అర్జున్‌కి యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ పెరిగిపోయింది. ‘గంగోత్రి’ సినిమాలో అమాయకంగా కనిపించిన బన్నీకి, ‘ఆర్య’లో స్టైల్‌గా అలరించిన బన్నకి అసలు సంబంధమే లేదని అనుకున్నారు. అలా బన్నీకి స్టార్ డమ్ తెచ్చి పెట్టిన సినిమా ఇదేనని చెప్పొచ్చు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, బన్నీని నిలబెట్టేసింది.

ఈ సినిమా విడుదలై నేటికి సరిగ్గా 17 ఏళ్ళు. ఈ సందర్భంగా కొన్ని విశేషాలు.. అల్లు అర్జున్ అనురాధ మెహతా, శివ బాలాజీ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా 2004 మే 7న విడుదలై అఖండ విజయం సాధించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ ఏమేమి చేయగలడో అన్ని చేశారు. అందులో భాగంగా కేవలం యాక్టింగ్ తోనే కాదు డాన్స్ లతోనూ, స్టంట్స్ తోనూ యువతరాన్ని అలరించారు.

ఈ సందర్భంగా ‘ఆర్య’ సినిమాను బన్నీ గుర్తు చేసుకున్నాడు. “నా జీవితంలో అతి పెద్ద మార్పు ‘ఆర్య’తోనే జరిగింది. ఆ సినిమాను ఇప్పటికీ నేను ఒక అద్భుతంగానే భావిస్తూ ఉంటాను. ‘ఫీల్ మై లవ్ .. ‘ అని నేను చెప్పిన దగ్గర నుంచి ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తూనే వస్తున్నారు. నాతో పాటు ఈ సినిమాకి పని చేసిన వాళ్లందరి జీవితాలు మారిపోయాయి. సుకుమార్ .. దిల్ రాజు .. దేవిశ్రీ ప్రసాద్ .. రత్నవేలు .. బన్నీ వాసు .. ఇలా అందరూ ఒక స్థాయికి ఎదిగిపోయారు. అలా ఈ సినిమా అందరి జీవితాలను మార్చేసింది. అలాంటి ఈ సినిమాను .. ఆ సినిమా పట్ల ప్రేక్షకులు చూపిన ఆదరణను ఎప్పటికీ మరిచిపోలేము” అని చెప్పుకొచ్చాడు.

- Advertisement -