ఇంగ్లాండ్‌ టెస్టు సిరీస్‌కు భారత్‌ జట్టు ఎంపిక..

98

ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్, ఇంగ్లండ్ టూర్ కోసం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ఈ ఏడాది జూన్‌ 18 నుంచి 22 వరకు బ్రిటన్‌లోని సౌతాంప్టన్‌లో ఈ సిరీస్‌ జరగనుంది. ఈ ఆరంభ టెస్టు చాంపియన్‌షిప్‌ ట్రోఫీ కోసం భారత్‌, న్యూజిలాండ్ తలపడనున్నాయి. కివీస్‌తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌ పోరుకు, ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు 20 మందితో జంబో జట్టును బీసీసీఐ సెలెక్షన్‌ కమిటీ శుక్రవారం ప్రకటించింది.

భారత జట్టు : రోహిత్ శర్మ , శుభ్ మన్ గిల్, మయాంక్ అగర్వాల్ , ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ(Captain), అజింక్య రహానే (vice-captain), హనుమ విహారీ, రిషబ్ పంత్ (wicket-keeper), అశ్విన్ , రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ , మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్, ఉమేష్ యాదవ్, కేఎల్ రాహుల్ , వృద్ధిమాన్ సాహా.

స్టాండ్ బై ఆటగాళ్లు : అభిమన్యు ఈశ్వరన్, ప్రసిద్ధ్ కృష్ణ , అవేశ్ ఖాన్, అర్జాన్ నాగఅశ్వల్లా

షెడ్యూల్ :

18th – 22nd June WTC Final vs NZ Southampton

4th – 8th August 1st Test at Nottingham

12th – 16th August 2nd Testat London (Lord’s)

25th – 29th August 3rd Test at Leeds

2nd – 6th September 4th Test at London (Oval)

10th – 14th September 5th Test at Manchester