స్వామి అగ్నివేష్ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం

222
cm kcr

ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ మరణం పట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమానికి స్వామి అగ్నివేష్ మొదటినుంచి సంపూర్ణ మద్దతుగా నిలిచారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఉద్యమ సందర్భంలో జరిగిన సమావేశాలు, కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.