పది విభాగాలుగా బడ్జెట్…

179
Arun Jaitley in budget speech
- Advertisement -

ప్రభుత్వంపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని వారి ఆశలకు అనుగణంగానే ప్రభుత్వం ముందుకు సాగుతుందన్నారు. పాలనలో పారదర్శకత తీసుకొచ్చామని … బంధుప్రీతి, అవినీతికి దూరంగా ఉన్నామని తెలిపారు.రైతులకు సులభంగా రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇకపై నాబార్డు డిజిటలైజ్ అవుతుందని తెలిపారు. పసల్ బీమా యోజనకు రూ.5.5 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. రాజకీయ పార్టీల విరాళాల్లో పారదర్శకత తీసుకొస్తామని తెలిపారు.

ఈ సంవత్సరం బడ్జెట్ ను పది విభాగాలుగా విడగొట్టినట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారు. మెరుగైన పరిపాలన, పేదల సంక్షేమం, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా తదితరాలే లక్ష్యంగా ప్రతిపాదనలు తయారు చేశానని చెప్పుకొచ్చారు.

() రైతుల ఆదాయం వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేయడం.
() ఉత్పాదకత, ప్రజల జీవనంలో క్వాలిటీ పెంచేలా ఇన్ ఫ్రాస్ట్రక్చచర్ రూపకల్పన.
() ఆర్థిక రంగంలో వృద్ధి, స్థిరత్వం కోసం తీసుకునే చర్యలు.
() పారదర్శకత, వేగంగా లావాదేవీల కోసం డిజిటల్ ఎకానమీ.
(). ప్రజల భాగస్వామ్యంతో పారదర్శక పాలన, మెరుగైన ప్రభుత్వ సేవలు.
() గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన ఉపాధిని కల్పించేలా మౌలిక వసతులు, పెట్టుబడులు.
() యువతలో నైపుణ్యాభివృద్ధి కోసం నిర్ణయాలు.
() పేదలు, బడుగు బలహీన వర్గాల ఆరోగ్యం, వారికి గృహ నిర్మాణం.
() అందుబాటులోని అన్ని వనరులనూ వాడుకుంటూ, ఆర్థిక స్థిరత్వం దిశగా చర్యలు.
() నిజాయితీగా పన్నుల వసూళ్ల దిశగా నిర్ణయాలు.

- Advertisement -