సైరా దర్శకుడితో ‘ఇస్మార్ట్ శంకర్’..

368
Hero-Ram-Pothineni
- Advertisement -

టాలీవుడ్‌ యంగ్‌ హీరో రామ్ గతేడాది ‘ఇస్మార్ట్ శంకర్’సినిమాతో భారీ హిట్‌ అందుకున్న తెలిసిందే. అంతేకాదు గత కొంత కాలంగా సరైన హిట్ లేని డైరెక్టర్‌ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఈ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చాడు. ఇందులో హీరో రామ్‌ను కొత్తగా చూపించాడు. ప్రస్తుతం రామ్‌ కిషోర్ తిరుమల దర్శకత్వంలో ‘రెడ్’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. ఈ మూవీ త్వరలో విడుదల కానుంది.

Hero Ram

మరోవైపు హీరో రామ్‌ మరో కొత్త ప్రాజెక్ట్‌ లైన్లో పెట్టినట్లు సమాచారం. అయితే రామ్ తన నెక్ట్స్‌ మూవీని దర్శకుడు సురేందర్ రెడ్డితో చేయబోతున్నాడని సినీ వర్గాల సమాచారం. అంతేకాదు దర్శకుడు సురేందర్ రెడ్డి రామ్ కోసం కథ కూడా సిద్ధం చేశాడట. ఇప్పటికే స్టోరీ లైన్ చెప్పి రామ్‌తో ఓకే అనిపించుకున్నాడట సురేందర్ రెడ్డి. త్వరలోనే పూర్తి స్క్రిప్ట్‌తో రామ్‌ను కలవనున్నాడు. దీంతో వీళ్లిద్దరి కలయికలో రాబోతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అపుడే అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం హీరో రామ్ రెడ్‌ మూవీతో బిజీ ఉన్నాడు.

- Advertisement -