సంక్షోభంలో శ్రీలంక క్రికెట్‌..

258
Arjun Ranatunga
- Advertisement -

వరుస ఓటములు..కొరవడిన క్రీడా స్పూర్తి..బోర్డు సభ్యుల్లో అవినీతి ఫలితంగా శ్రీలంక క్రికెట్ సంక్షోభంలో పడింది. ఈ నేపథ్యంలో వన్డే ప్రపంచకప్‌ కోసం ఇంగ్లాండ్‌ వెళ్తున్న శ్రీలంకకు ఘోర పరాభవం తప్పదని ఆ జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ తెలిపారు.

బోర్డులో అవినీతి..ఆటగాళ్లలో స్ఫూర్తి కొరవడింది.. ఒకరినొకరు బాహాటంగా తిట్టుకుంటున్నారు అని రణతుంగ మండిపడ్డారు. కొంతమంది ఆటగాళ్లు దేశం కోసం కాకుండా వ్యక్తిగత లాభం కోసం ఆడుతున్నారని విమర్శించారు. ఆటగాళ్లలో స్పూర్తిని నింపి మానసికంగా బలవంతులుగా మార్చేందుకు శిక్షణ ఇవ్వాలన్నారు.

జట్టు వరుస ఓటములకు జాతీయ క్రికెట్‌ బోర్డు, కొంతమంది ఆటగాళ్లే కారణమని రణతుంగ అభిప్రాయపడ్డారు. ఆటగాళ్లలో క్రమశిక్షణ పెంపొందించాల్సిన అవసరం ఉందని.. ఇవన్నీ చూస్తుంటే ప్రపంచకప్ లీగ్‌దశలోనే శ్రీలంక వెనుదిరిగి వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు.

శ్రీలంక టీ20 సారథి లసిత్‌ మలింగ, తాత్కాలిక సారథి తిసారీ పెరీరా సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. లంక బోర్డు వీరిని హెచ్చరించినా మారకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో రణతుంగ చేసిన కామెంట్స్‌ ప్రాధాన్యతను సంతరించుకుంటాయి.

- Advertisement -