ముంబై జట్టులోకి అర్జున్ టెండూల్కర్‌!

448
arjun tendulkar
- Advertisement -

ఐపీఎల్ 2020 ప్రారంభానికి మరో నాలుగురోజులు మాత్రమే మిగిలిఉంది. ఇప్పటికే అన్ని ప్రాంఛైజీలు ప్రాక్టీస్ సెషన్‌లో మునిగితేలగా తాజాగా ముంబై ఇండియన్స్‌ జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో చేరాడు మాస్టర్ బ్లాస్టర్‌ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్.

ముంబయి జట్టుతో కలిసి నెట్స్‌లో బౌలింగ్ ప్రాక్టీస్ చేశాడు అర్జున్ టెండూల్కర్‌. ముంబై బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, జేమ్స్ పాటిన్సన్ తదితరులతో కలిసి స్విమ్మింగ్ ఫూల్‌లో అర్జున్ టెండూల్కర్ సేద తీరుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.కానీ ముంబై దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి. తొలి మ్యాచ్‌లో చెన్నైతో తలపడనుంది ముంబై.

- Advertisement -