మరింత దిగొచ్చిన బంగారం ధర…

239
gold price
- Advertisement -

బంగారం ధర మరింత దిగొచ్చింది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.370 తగ్గి రూ.53,530కి చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.370 తగ్గి రూ.49,070కు చేరింది.

పసిడి బాటలోనే వెండికూడా తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధర రూ.660 తగ్గి రూ.68,300కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.14 శాతం పెరుగుదలతో 1966 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.42 శాతం పెరుగుదలతో 27.46 డాలర్లకు చేరింది.

- Advertisement -