ఐపీఎల్‌లోకి అర్జున్ టెండూల్కర్

143
Arjun Tendulkar
- Advertisement -

ఐపీఎల్ 14వ సీజన్ వేలానికి రంగం సిద్ధమైంది. ఇక ఈ సారి వేలంలో పలువురు స్టార్ ఆటగాళ్లు ఉండగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్‌లో అరంగేట్రం చేయనున్నాడు. ఈ నెల 18న మెగా టోర్నీ వేలం జరగనుండగా, 21 ఏళ్ల అర్జున్ రూ. 20 లక్షల కనీస ధర (బేస్ ప్రైస్)తో తన పేరును నమోదు చేసుకున్నాడు. ఇటీవల ముగిసిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జూనియర్ టెండూల్కర్ ముంబైకి ప్రాతినిధ్యం వహించాడు.

చెన్నైలో ఫిబ్రవరి 18న వేలం జరగనుండగా 1097 ఆటగాళ్లు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 814 మంది స్వదేశీ ఆటగాళ్లు ఉండగా.. 283 వీదేశీ ఆటగాళ్లు ఉన్నారు.

కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఏకంగా రూ. 53.20 కోట్లతో వేలానికి దిగనుండగా,రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వద్ద రూ. 35.90 కోట్లు, రాజస్థాన్ రాయల్స్ వద్ద రూ. 34.85 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ వద్ద రూ. 22.90 కోట్లు, ముంబై ఇండియన్స్ వద్ద రూ. 15.35 కోట్లు, ఢిల్లీ కేపిటల్స్ వద్ద రూ. 12.9 కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ వద్ద చెరో రూ. 10.75 కోట్లు ఉన్నాయి.

- Advertisement -