అర్జున్ రెడ్డి.. బోల్డ్..బ్రిలియంట్

264
Arjun Reddy Raw & Original says mahesh
- Advertisement -

విడుదలకు ముందు నుంచే వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న అర్జున్ రెడ్డి….విడుదల తర్వాత హిట్  టాక్‌తో దూసుకుపోతోంది. కలెక్షన్ల సునామీతో బాక్సాఫీసు పంట పండిస్తోంది. సినీ దర్శకుడు రాజమౌళి, వర్మ,క్రిష్ తో పాటు  పలువురు సెలబ్రెటీలు అర్జున్ రెడ్డి సినిమాపై ప్రశంసలు గుప్పించగా తాజాగా ప్రిన్స్ మహేష్ ఆ జాబితాలో చేరారు. అర్జున్ రెడ్డి సినిమాను ఆకాశానికెత్తేశాడు.

హీరో విజయ్ దేవరకొండతో పాటుగా దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ను అభినందించాడు. ‘బోల్డ్.. ఒరిజినల్.. బ్రిలియంట్ అర్జున్ రెడ్డి. గత చిత్రాలకు విభిన్నమైన చిత్రం. విజయ్ దేవరకొండ లైఫ్‌టైమ్ పెర్ఫార్మెన్స్‌తో వచ్చాడు. అతని నటన అధ్బుతం అనిచెప్పినా కూడా అది తక్కువే అవుతుంది. హీరోయిన్ షాలిని ఆమె ఫ్రెండ్స్ బ్రిలియంట్‌గా చేశారు

ఇక సందీప్ వంగా తీసింది మొద‌టి సినిమానేనా అనేలా ఉంద‌ని, ఎంతో అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుడిలా చిత్రీక‌రించాడ‌ని చెప్పాడు. మీకు, మీ టీమ్ కి కంగ్రాట్స్ స‌ర్ అని ఆకాశానికెత్తేశాడు. ఓ పక్క సినిమా నిలిపివేయాలంటూ అభ్యంతరాలు వస్తున్న సమయంలో మహేష్ ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది.

Arjun Reddy Raw & Original says mahesh

- Advertisement -