యారోగెంట్ అర్జున్ రెడ్డి ట్రైల‌ర్ !

225
- Advertisement -

పెళ్ళిచూపులు చిత్రం సన్సేషనల్ హిట్ సాధించిన హీరో విజయ్ దేవర కొండ కథానాయకుడుగా రూపొందుతున్న చిత్రం `అర్జున్ రెడ్డి`. షాలిని హీరోయిన్‌గా న‌టిస్తుంది. భ‌ద్ర‌కాళి పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌ణ‌య్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రారంభం నుండి ప్రేక్ష‌కుల్లో అంచ‌నాల‌ను పెంచుతుంది. విల‌క్ష‌ణ పాత్ర‌లు చేయ‌డానికి ఆస‌క్తి చూపే హీరో విజ‌య్ దేవ‌ర కొండ ఈ చిత్రంలో యారోగెంట్ మెడిక‌ల్ స్టూడెంట్ పాత్ర‌లో క‌న‌ప‌డ‌బోతున్నాడు.పోస్ట‌ర్స్‌, టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి హ్యుజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా`అర్జున్ రెడ్డి` సినిమా ట్రైల‌ర్ విడుద‌లైంది. మూడు నిమిషాల నిడివి ఉన్న ట్రైల‌ర్ ద్వారా విజ‌య్‌లోని కొత్త కోణాన్ని ద‌ర్శ‌కుడు సందీప్ వంగ ఆవిష్క‌రించిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

కోపాన్ని నియంత్రించుకోలేని ఓ మెడిక‌ల్ స్టూడెంట్ క‌థ‌తో ఈ సినిమా తెర‌కెక్కింది. క‌మ‌ల్ కామ‌రాజ్ ఓ ప్ర‌త్యేక పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఈ చిత్రానికి రాధ‌న్ స్వ‌రాలు స‌మకూర్చారు. ఆగ‌స్టు 25న ఈ చిత్రం విడుద‌ల‌కానుంది. మంచి ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని నైజాంలో ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ ఏషియ‌న్ ఫిలింస్‌తో పాటు కె.ఎఫ్‌.సి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ‌లు సంయుక్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల చేస్తున్నాయి.

- Advertisement -