విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా విడుదలకు ముందు ఎంతటి వివాదాన్ని మూటగట్టుకుందో తెలిసిందే. అయితే ఆ వివాదం సినిమాకు చేటుగా మారుతుందేమోనని అనుకున్నారు కానీ.. అది కాస్తా రివర్స్ అయింది.
పాజిటివ్ టాక్ తో, అదరగొట్టే వసూళ్లతో దుమ్ముదులిపేస్తున్నాడు ‘అర్జున్ రెడ్డి’. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున మంచి వసూళ్లను సాధించింది.
నైజామ్ లో 1.22 కోట్లు .. సీడెడ్ లో 33 లక్షలు .. ఉత్తరాంధ్రలో 21 లక్షలు.. ఈస్ట్ గోదావరిలో 12 లక్షలు .. వెస్ట్ గోదావరిలో 9 లక్షలు .. కృష్ణాలో 25 లక్షలు .. గుంటూరులో 20 లక్షలు .. నెల్లూరులో 5 లక్షలను రాబట్టింది. ఇలా ఈ సినిమా తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల 47 లక్షలను వసూలు చేసింది. ఇక ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టినట్టు తెలుస్తోంది.
ఈ సినిమాతో విజయ్ దేవరకొండ కెరియర్లో మరో హిట్ నమోదైనట్టేననే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈ సినిమా వీకెండ్ లో సాలిడ్ వసూళ్లను పొందే అవకాశం ఉందని టాక్.