నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేః అర్జున్ రెడ్డి ర‌చయిత్రి

332
lyricist-Shreshta
- Advertisement -

టాలీవుడ్ లో గ‌త కొద్ది రోజులుగా క్యాస్టింగ్ కౌచ్ దుమారం రేగిన సంగ‌తి తెలిసిందే. తాము కూడా క్యాస్టింగ్ క్యాచ్ కు బాధితుల‌మే అని చాలా మంది మ‌హిళ‌లు త‌మ గోడును వెళ్ల‌బోసుకున్నారు. ఇండ‌స్ట్రీలో పురుషుల‌కు కూడా క్యాస్టింగ్ కౌచ్  ఎదుర‌వుతుందని చెప్పాడు ఓ న‌టుడు. సినిమా అవ‌కాశాల పేరుతో ప్రోడ్యూసర్లు, డైర‌క్ట‌ర్లు అమ్మాయిల‌ను వాడుకుంటార‌ని కొంత మంది ప్ర‌త్య‌క్షంగా టీవి డిబెట్ ల‌లో చెప్పారు. ఇక టాలీవుడ్ లో కొన్ని రోజుల పాటు క్యాస్టింగ్ కౌచ్ పై హాట్ హాట్ గా సాగిన చివ‌ర‌కు ఫ‌లితం లేకుండా పోయింది.

lyricist-Shreshta

ఇండ‌స్ట్రీలో ఉన్న హీరోయిన్ ల‌కు , యాక్ట‌ర్స్ కు మాత్ర‌మే క్యాస్టింగ్ కౌచ్ వేధింపులు ఉన్నాయ‌న‌కున్నాం కానీ మ‌హిళా ర‌చయిత్రిల‌కు కూడా ఈ బాధ‌లు త‌ప్ప‌డం లేదు. అర్జున్ రెడ్డి, పెళ్లి చూపులు సినిమాల్లో ప‌లు పాట‌లు రాసిన శ్రేష్ట తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ లో ఓ బాధితురాలినే అని చెప్పింది. తాజాగా ఓ ఛాన‌ల్ ఇచ్చిన ఇంట‌ర్యూలో ఆమె ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెల్ల‌డించారు.  ఇండ‌స్ట్రీలో త‌న‌కు ఎన్నో వేధింపులు ఎదుర‌య్యాని తెలిపింది.

చాలా ర‌కాలుగా ఇండ‌స్ట్రీలో త‌న‌కు చేదు అనుభ‌వాలు ఎద‌రుయ్యాయ‌ని తెలిపింది. ఆ కార‌ణంతోనే ఇండ‌స్ట్రీకి రావ‌డం చాలాసార్లు వాయిదా వేసాన‌న్నారు. ఓ నిర్మాత భార్య త‌న‌కు ఫోన్ చేసి త‌న భ‌ర్త వ‌ద్దకు వెళ్లాల‌ని డిమాండ్ చేసింద‌న్నారు. అలాగే ఓ మహిళా ద‌ర్శ‌కురాలు కూడా త‌న‌కు ఫోన్ చేసి ఓ వ్య‌క్తి ద‌గ్గ‌రికి వెళ్లాల‌ని చెప్పారు. ఓ వ్య‌క్తి గోవాలో పార్టీ ఇస్తున్నాడ‌ని..త‌న‌ను కూడా అక్క‌డికి వెళ్లాల‌ని ఆ మ‌హిళా ద‌ర్శ‌కురాలు త‌న‌ను ఇబ్బంది పెట్టింద‌ని చెప్పింది. అయితే తాను ఆ పార్టీకి వెళ్ల‌క‌పోవ‌డంతో ఆ వ్య‌క్తి నాకు ఫోన్ చేసి ఇష్టం వ‌చ్చిన‌ట్టు తిట్టాడ‌ని పేర్కొంది. ఇలాంటి ఇబ్బందుల వ‌ల్లే చాలా రోజులు ఇండ‌స్ట్రీకి రాకుండా ఆగిపోయాన‌న్నారు పాట‌ల ర‌చయిత్రి శ్రేష్ట‌.

- Advertisement -