అన్నపూర్ణ స్టూడియోలో అసెంబ్లీ

225
mahesh babu
- Advertisement -

అన్నపూర్ణ స్టూడియో కళకళ లాడిపోతోంది. పదుల సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి. ఒక్కో వాహనం నుంచి ఒక్కో ఎమ్మెల్యే వస్తున్నారు. తెల్ల చొక్కాలు, పచ్చ చొక్కాలు, మెడలో పార్టీ గుర్తు కండువాలతో ఎమ్మెల్యేలు జిగేల్ మంటున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ఏం జరుగుతోంది.. ఎమ్మెల్యేలంతా ఎందుకు వస్తున్నారు అని అనుకుంటున్నారా..? ఇదంతా  మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ సినిమా కోసమే.కొరటాల శివ డైరెక్షన్ లో భరత్ అనే నేను సినిమాలో మహేష్ పొలిటికల్ లీడర్ గా కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది.

అన్నపూర్ణ స్టూడియో పెద్ద అసెంబ్లీ సెట్ కూడా వేశారు. ఎమ్మెల్యేలు.. వాళ్ల వెనుక అనుచరులు.. వాళ్ల జేజేలతో షూటింగ్ స్పాట్ హోరెత్తిపోతోంది. రాజకీయ నాయకులంటేనే ఖద్దరు చొక్కాలు.. మెళ్లో కండువాలు కామన్ కాబట్టి షూటింగ్ స్పాట్ లో చాలామంది అదే వేషాల్లో తిరిగేస్తున్నారు. ఓ రకంగా అన్నపూర్ణ స్టూడియో అంతా విపరీతమైన రాజకీయ ఆర్భాటం కనిపిస్తోంది. ఈ సినిమాలో అసెంబ్లీ సీన్ కోసం అన్నపూర్ణలో రెండు కోట్ల ఖర్చుతో భారీ సెట్ వేసారు. అచ్చం సమైక్య రాష్ట్రంలో అసెంబ్లీ ఎలా వుండేదో, అలాగే అచ్చు గుద్దినట్లు సెట్ వేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో స్పీకర్‌ గా  సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలిత స్పీకర్ గా కనిపిస్తున్నారు. ప్రతిపక్ష నాయకుడిగా దేవరాజ్ వున్నారు. కాస్త వినోదం పుట్టించడానికి పృధ్వీ పక్కనే వున్నారు. మరి ఎమ్మెల్యేలు.

అందుకే సహజంగా వుండాలని, సినిమా ఆసక్తి వుండి, కాస్త విగ్రహం వున్నవాళ్లకు కబుర్లు అందాయి. ఎవరికి వాళ్లు, వాళ్ల వాళ్ల ఖద్దరు, కాటన్ షర్టులు, నెహ్రూ కోట్లు తెచ్చుకుని అన్నపూర్ణకు వచ్చేసారు. ఈ చెట్టు చాటున, ఆ కారు చాటున డ్రెస్ లు చేంజ్ చేసుకుని, అసెంబ్లీలోకి వెళ్లిపోయారు. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ భామ కియారా అద్వానీ నటిస్తోంది.

- Advertisement -