అర్జున్ రెడ్డి భామలో మరో కోణం…

572
shalini panday
- Advertisement -

చేసింది ఒక్క సినిమానే అయినా అమాయకపు చూపులూ, ముద్దు ముద్దు మాటలతో యువతరాన్ని కట్టిపడేసింది శాలినీ పాండే. నటనే ప్యాషన్‌ అంటోన్న ఈ జబల్‌పూర్‌ యువరాణి… నటి అయ్యేందుకు మాత్రం చాలానే కష్టపడింది.ఓ వైపు ఇంజినీరింగ్‌ చేస్తూనే మరోవైపు థియేటర్‌ ఆర్ట్స్‌లో శిక్షణ పొందింది. ఈ ముద్దుగుమ్మ నటించిన అర్జున్‌ రెడ్డి సినిమా 2017 సంవత్సరంలో ట్రెండ్‌ సెట్‌ సినిమాగా నిలిచింది.యువతకు బాగా కనెక్ట్ అయిన ఆ సినిమాపై ఇప్పటికి గ్రూప్ డిస్కర్షన్స్ జరుగుతున్నాయంటే ఏ రేంజ్ లో పాకిందో అర్థం చేసుకోవచ్చు.

shalini panday

ఇక అసలు విషయానికి వస్తే.. ఆ సినిమాలో బేబీ అంటూ ప్రీతి పాత్రలో అందంగా కనిపించిన శాలిని పాండే కు స్పెషల్ ఇమేజ్ వచ్చింది. ప్రస్తుతం ఈ భామ తెలుగుతో పాటు తమిళ్ లో కూడా పలు సినిమాల్లో  నటిస్తోంది. అయితే సినిమాలో బేబీ అంటూ హార్ట్ ని టచ్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తింది. తనలోని సరికొత్త టాలెంట్ ని ప్రేక్షకులకు చూపించడానికి రెడీ అవుతోంది. షాలిని పాటలను చాలా బాగా పాడుతుందట. ముందుగా ఈ విషయం పెద్దగా ఎవరికి తెలియకపోయినప్పటికి రీసెంట్ గా రిలీజ్ చేసిన ఒక ప్రోమో ద్వారా క్లారిటీ వచ్చేసింది. అసలు పాడింది షాలినేనా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

shalini panday

ఇండియన్ పాప్ రాక్ బ్యాండ్ లగొరి కంపోజ్ చేసిన మ్యూజిక్ కి షాలిని శ్రుతి కరెక్ట్ గా సెట్ అయ్యింది. పాడింది ఒక లైన్ అయినా చాలా స్వీట్ గా ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక ఫుల్ సాంగ్ ని ఈ నెల 14న రిలీజ్ చేయబోతున్నారు. ప్రస్తుతం షాలిని కోలీవుడ్ లో 100% కాదల్ అనే సినిమాలో నటిస్తోంది.

- Advertisement -