అర్జున్, జేడీ కాంబోలో.. ‘కాంట్రాక్ట్’..

312
- Advertisement -

యాక్షన్ కింగ్ అర్జున్ చాలా రోజుల విరామం తర్వాత హీరోగా నటిస్తున్న తెలుగు చిత్రం కాంట్రాక్ట్. ఇందులో హీరో జేడీ చక్రవర్తి చాలా రోజుల తర్వాత విలన్‌గా నటిస్తుండటం విశేషం. ప్రముఖ కన్నడ కథానాయిక రాధికా కుమారస్వామి ఇందులో అర్జున్‌కు జోడిగా నటిస్తున్నారు. సీనియర్ దర్శకులు కే విశ్వనాథ్ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ప్రసిద్ధ బాలీవుడ హీరో అమీర్ ఖాన్ సొంత తమ్ముడు, మేళా తదితర హిందీ చిత్రాల్లో నటించిన ఫైజల్ ఖాన్ నటిస్తున్న తొలి దక్షిణాది చిత్రం ఇదే. సంజయ్ గొడావత్ సమర్పణలో సమీర్ ప్రొడక్షన్స్ పతాకంపై ఎస్ఎస్ సమీర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.

 Arjun And JD Chakravarthy In 'Contract'

ఈ చిత్రం గురించి సమీర్ మాట్లాడుతూ.. ”ఇదొక భారీ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం. ఫ్యామిలీ, ఎమోషన్ అంశాలకూ అధిక ప్రాధాన్యం ఉంది. అర్జున్ మల్టీ మిలియనీర్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికి నాలుగు షెడ్యూళ్లు చిత్రీకరించాం. టాకీ పార్ట్‌తోపాటు మూడు పాటల చిత్రీకరణ పూర్తయింది. ఈ వారంలో ఒక పాటను మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో చిత్రీకరించనున్నాం. మిగిలిన రెండు పాత్రలను థాయ్‌లాండ్‌లో షూట్ చేస్తాం. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి జూన్ తొలివారంలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం” అని తెలిపారు.

అర్జున్, జేడీ చక్రవర్తి, రాధికా కుమారస్వామి, కే విశ్వనాథ్, ఫైజల్ ఖాన్, సోని చరిస్టా, సమీర్, రాంజీగానీ, సంధ్యా జనక్, అశోక్ కుమార్, వింధ్యా తివారీ, రఘు, భూషణ్, అబిద్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: అమీర్ లాల్, సంగీతం: సుభాష్ ఆనంద్, కోరియోగ్రఫీ: అమ్మ రాజశేఖర్, ఆర్ట్: రఘు కులకర్ణి, ఎడిటింగ్: ప్రభు, సమర్పణ: సంజయ్ గొడావత్

- Advertisement -