రేషన్ మేనేజర్‌గా అరియానా…పరీక్షలో పాస్!

132
ariyana

ఏడవ వారంలో ఇంటి కెప్టెన్‌గా ఎంపికయ్యేందుకు చివరి వరకు ప్రయత్నించి విఫలమైంది అరియానా. అవినాష్ వైపు ఉన్న సభ్యులను కన్విన్స్ చేసేందుకు చివరి వరకు ప్రయత్నించినా విఫలం కావడంతో కంటతడి పెట్టుకుంది.

అయితే అవినాష్ కెప్టెన్ అయిన వెంటనే అరియానాకు కాసింత ఓదార్పు ఇచ్చేలా రేషన్ మేనేజర్ ఛాన్స్ ఇచ్చాడు. దీంతో సభ్యులంతా అరియానాకు విషెస్ తెలపగా ఆమెను స్టోర్ రూమ్‌లోకి పిలిచారు బిగ్ బాస్. ఈ వారానికి సరిపడా రేషన్, అభిజీత్ నుంచి గతంలో తీసుకున్న బట్టలు, ఇతర వస్తులను అరియానా ముందు ఉంచారు. ఈ రెండింటిలో ఒకటి ఎంపిక చేసుకోవాలని సూచించారు. దీంతో అరియానా కాస్త ఇబ్బంది పడింది.

అభిజీత్ బట్టలు ఈవారానికి మాత్రమే ఇవ్వరా.. లేకపోతే ఈ సీజన్ మొత్తం ఇవ్వరా.. తనకు క్లారిటీ కావాలని అడిగింది. కానీ, బిగ్ బాస్ మాత్రం రెండింటిలో ఏం కావాలో తేల్చుకోవాలని తెగేసి చెప్పారు. బయట ఉన్న అభిజిత్‌తో పాటు మిగితా సభ్యులు అంతా రేషన్ తీసుకోవాలని గట్టిగా అరిచారు. అయితే ఇది తెలియని అరియానా తనని క్షమించాలని అభిజిత్‌ని వేడుకుంటూనే ఈ వారానికి సరిపడా రేషన్ సామాను తీసుకుని పరీక్షలో పాసైంది.