కళ్ళు తిరుగుతున్నాయా.. జాగ్రత్త !

66
- Advertisement -

చాలమందికి కళ్ళు తిరిగే సమస్య ఉంటుంది. వేగంగా పరిగెత్తినా లేదా సడన్ గా కూర్చున్నా, నిలబడిన లేదా మనసుకు షాక్ కలిగించే వార్తలు విన్నా.. ఇలాంటప్పుడు కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది. ఇంకా ఏదైనా పని చేసేటప్పుడు, లేదా ఎక్కువసేపు వ్యాయామం చేసినప్పుడు, సరైన సమయానికి ఆహారం తీసుకొనప్పుడు, ఇంకా అలసట నీరసం వంటి సమస్యలు ఉన్నప్పుడూ ఇలా చాలా కారణాల వల్ల కళ్ళు తిరుగుతుంటాయి. అయితే ఈ సమస్య వల్ల స్పృహ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. అయితే ఈ వేసవిలో వడదెబ్బ కారణంగా కూడా కళ్ళు తిరిగే సమస్య ఏర్పడుతుంది. అయితే చాలమంది ఈ సమస్యను అశ్రద్ద వహిస్తుంటారు.

కానీ వైద్య నిపుణులు ఈ సమస్య పట్ల అశ్రద్ద వహించవద్దని చెబుతున్నారు. కళ్ళు తిరగడం అనేది పలు అనారోగ్య సమస్యలకు సూచన అని నిపుణులు చెబుతున్నారు. కళ్ళు తిరిగే సమస్యను చాలమంది విర్టిగో అని భావిస్తారు. కేవలం ఇదొక్కటే కాకుండా కళ్ళు తిరగడానికి ఇంకా చాలానే అనారోగ్య సమస్యలు ఉన్నాయి. మైగ్రేన్ ఉన్నవారిలో కూడా తలనొప్పితో పాటు అలసట, కళ్ళు తిరగడం, కడుపులో వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Also Read:‘ఎన్టీఆర్ 30’లో యంగ్ హీరో ?

కాబట్టి మైగ్రేన్ రావడానికి సూచనగా కళ్ళు తిరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా లో బీపీ, రక్త హీనత వంటి సమస్యలు ఉన్నవాళ్ళల్లో కూడా కళ్ళు తిరగడం జరుగుతుంది. మహిళలలో గర్బధారణ వల్ల కూడా కళ్ళు తిరుగుతుంటాయి. ఇక ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక రుగ్మతలు దీర్ఘకాలికంగా కొనసాగుతే కూడా కళ్ళు తిరిగే సమస్య ఏర్పడుతుంది. అయితే ఈసమస్యను అశ్రద్ద వహించకుండా వైద్యుడిని సంప్రదించి తగు మెడిసన్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు, అలాగే మన శరీరానికి అవసరమైన మోతాదులో నీరు త్రాగడం, సమయానికి ఆహారాన్ని తీసుకోవడం, మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం వంటివి అలవాటు చేసుకోవడం వల్ల ఈ కళ్ళు తిరిగే సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు.

Also Read:పిక్ టాక్ : రకుల్ ఆన్ గ్లామర్ ఫైర్

- Advertisement -