మధ్యాహ్నం నిద్ర పోతున్నారా.. ఇవి తెలుసుకోండి!

52
- Advertisement -

నేటి ఉరుకుల పరుగుల జీవితంలో నిద్ర పోవడానికి సరైన సమయం కేటాయించలేక ఇబ్బంది పడుతుంటారు. తీవ్రమైన పని ఒత్తిడి కారణంగా రాత్రి వేళలో కూడా చాలా మందికి నిద్ర పట్టదు. దాంతో మన శరీరానికి ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టూముడుతాయి. ఎందుకంటే నిరంతరం పని చేసే శరీరభాగాలకు నిద్ర అనేది ఎంతో రిలీఫ్ ను ఇస్తుంది. తద్వారా రోజుకు కనీసం 5-6 గంటలు నిద్ర పోతే ఆరోగ్యకరంగా ఉండడంతో పాటు రోజంతా ఎంతో ఉత్సాహంగా పని చేసుకోగలుగుతాము. అయితే కొందరికి రాత్రి వేళలో నిద్ర సరిగా పట్టదు. అలాంటి వారు పగలు మధ్యాహ్నం నిద్రపోవడానికి ఇష్టపడతారు. .

ఇంకా రోజంతా పని చేసేవారు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తరువాత కనీసం ఒక గంటైనా కునుకు తీస్తుంటారు. అయితే మధ్యాహ్న సమయంలో నిద్ర పోవడం మంచిదేనా ? అనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మధ్యాహ్నం నిద్ర పోవడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే అపోహ కూడా చాలా మందిలో ఉంది. మరి నిజంగానే మధ్యాహ్నం నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరమా అంటే అసలు కానే కాదని నిపుణులు చెబుతున్నారు. మధ్యాహ్నం నిద్ర పోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయట. వివిధ కారణాల వల్ల రాత్రి సరిగా నిద్రపోని వారు ఉదయం నుంచి ఎంతో చిరాకుగా ఉంటూ అలసటకు లోనౌతుంటారు.

Also Read: గోంగూర ఎక్కువగా తింటున్నారా?

ఇలాంటి వారిలో జ్ఞాపకశక్తి కూడా లోపిస్తుంది. దీంతో సరిగా పని మీద దృష్టి కేంద్రీకరించలేరు. అలాంటి వాళ్ళు మధ్యాహ్నం ఒక కునుకు తీస్తే మైండ్ రిఫ్రెష్‌ అయి తిరిగి ఫుల్ యాక్టివ్ అవుతారని పలు అధ్యయనలు చెబుతున్నాయి. అయితే మధ్యాహ్నం 30 నిముషాల నుంచి 1 గంట వరకు మాత్రమే నిద్ర పోతే మంచిదేగాని.. అంతకంటే ఎక్కువ టైమ్ నిద్ర కోసం కేటాయిస్తే కూడా ప్రమాదమేనట. ఎందుకంటే రాత్రిపూట నిద్ర సమయంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతే కాకుండా మధ్యాహ్నం గంటల తరబడి నిద్ర పోయే వారికి హార్ట్ స్ట్రోక్ ముప్పు కూడా పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అలసటగా భావించినప్పుడు మధ్యాహ్నం ఒక గంట నిద్ర కోసం కేటాయిస్తే ఎలాంటి సమస్యలు రావని.. అంతకు మించి ఎక్కువ సమయం కేటాయించకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: ఇవి తినండి.. బరువు తగ్గండి!

- Advertisement -