ఆగస్టు 15న ‘అరవింద సమేత’ టీజర్..

161

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘అరవింద సమేత వీర రాఘవ’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. పూజా హెగ్డే నాయికగా నటిస్తుంది. ఫస్ట్‌లుక్ పోస్టర్స్ తోనే సినిమాలో ఎన్టీఆర్ పవర్ ఫుల్ రోల్‌లో కనిపిస్తాడని హింట్ ఇచ్చారు చిత్ర బృందం. ఈ సినిమా దసరా సీజన్‌లో రిలీజ్ చేస్తారని ఇప్పటికే వార్తలు వచ్చినా డేట్ విషయంపై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు . తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర టీజర్, సినిమా రిలీజ్ డేట్లను ‘అరవింద సమేత’ టీమ్ లాక్ చేసిందట.

Aravinda Sametha

ఈ సినిమాను దసరాకి అంటే అక్టోబర్ 11వ తేదీన కచ్చితంగా విడుదల చేయనున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ నెల 15వ తేదీన ఫస్టు టీజర్‌ను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఫస్టు లుక్ తో అందరినీ తన వైపుకు తిప్పుకున్న వీరరాఘవుడు, ఫస్టు టీజర్‌తో ఏ స్థాయిలో ఆకట్టుకుంటాడో చూడాలి మరి.