శ్రీనివాస కళ్యాణానికి ‘గీత గోవిందం’ ఎఫెక్ట్‌..

336
Geetha Govindam
- Advertisement -

సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో నితిన్ హీరోగా నటించిన చిత్రం శ్రీనివాస కల్యాణం. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన ఈ మూవీలో నితిన్ సరసన రాశి ఖన్నా, నందిత శ్వేత హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా ఆగస్టు 9వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. బంధాలు .. అనుబంధాలు .. వివాహ ప్రాముఖ్యత అనే అంశాలను కలుపుకుంటూ ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి నాలుగు రోజుల్లో ఈ సినిమా 8.5 కోట్ల షేర్ ను రాబట్టింది. ఈ రోజు నుంచి కూడా ఈ సినిమా వసూళ్ల పరంగా తన జోరు చూపించవలసి వుంది.

Geetha Govindam

ఇక ఆగస్టు 15న ‘గీత గోవిందం’ థియేటర్లకు రానుంది. విజయ్ దేవరకొండ.. రష్మిక మందన జంటగా నటించిన ఈ సినిమాపై యూత్‌లో విపరీతమైన క్రేజ్ వుంది. అందువలన ఈ సినిమా విడుదల .. ‘శ్రీనివాస కళ్యాణం’ వసూళ్లపై ప్రభావం చూపించే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజే కారణంగా ‘గీత గోవిందం’ సినిమాకు స్టార్ హీరో సినిమా రేంజ్‌లో అడ్వాన్స్ బుకింగ్స్ వస్తుండడం ఇపుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.

- Advertisement -